వాట్సాప్ లో న్యూ అప్డేట్…. వాట్సాప్ లో ఛానల్ క్రియేట్ చేయడం ఎలాగో తెలుసా….!!

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల మరో ఫీచర్ను ప్రవేశపెట్టింది. అది వాట్సాప్ ఛానల్. ఈజీగా చెప్పాలంటే… ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ లో ఎవరిని ఎలా ఫాలో అయితే వారికి సంబంధించిన పోస్ట్లు, అప్డేట్లు వస్తాయో… వాట్సాప్ ఛానల్ కూడా అలాంటిదే. ఇందులో మనం ఎవరినైనా ఫాలో అయితే వాళ్ల పోస్ట్ చేసే వివరాలు మనకు అందుతాయి.

ప్రముఖ వ్యక్తులతో పాటు మీడియా సంస్థలకు చెందిన వాట్సాప్ చానల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు ప్రముఖ సెలబ్రెటీలు వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకోగా.. వారికి మిలియన్లలో ఫాలోవర్స్ వచ్చారు. అయితే సామాన్య వ్యక్తులు కూడా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. సులువుగా కొన్ని నిమిషాల్లోనే ఒక ఛానల్ ఓపెన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. హోమ్ పేజ్ లో కనిపించే ప్లస్ సింబలను క్లిక్ చేస్తే ఛానల్ క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.

ఛానల్ పేరు, సెట్టింగ్లను సెట్ చేసుకున్న తరువాత క్రియేట్ ఛానల్ అనే బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ ఛానల్ లింక్ ను వేరే వారికి పంపాలంటే ఛానల్ లింక్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక చానల్ ను డిలీట్ చేయాలంటే…యాప్ అప్డేట్స్ ఎంచుకుని.. ఆ తర్వాత వాట్స్అప్ ఛానల్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఇన్ఫర్మేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి డిలీట్ ఛానల్ అనే దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ రిజిస్టర్ నెంబర్ను కన్ఫామ్ చేసిన తర్వాత డిలీట్ బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.