డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో…. నోటీసులు జారీ… ఆ హీరో ఎవరంటే….!!

మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యువ హీరో నవదీప్ కు నార్కోటిక్ బ్యూరో నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న విచారణకు హాజరు కావాలని గురువారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. 41A కింద నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

కాగా టాలీవుడ్ ను మాదాపూర్ డ్రగ్స్ కేసు వ్యవహారం దడ పుట్టిస్తుంది. వరుసగా సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో ఇండస్ట్రీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు వెలుగు చూడటం ఇదేం కొత్త కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తుపట్టారు. కొందరు డ్రగ్స్ పెడ్లర్లుగా మరి అమ్ముతున్నట్లు తెలిసింది.

గత కొన్ని నెలలుగా ఈ డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈమధ్య నిర్మాత కేపి చౌదరిని అరెస్ట్ చేయడంతో మరోసారి టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఎంతోమంది స్టార్లు ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. మాదాపూర్ డ్రగ్స్ కేసుతో ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో పోలీసులు హీరో నవదీప్ ను నిందితుడిగా చేర్చిండంతో తీవ్ర చర్చనీయాంసంగా మారింది.