బాల‌కృష్ణ‌, త‌మ‌న్నా కాంబోలో మిస్ అయిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏదో తెలుసా?

సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఇప్ప‌టికీ చేతి నిండా సినిమాలు, వెబ్ సిరీస్ ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ న‌టిస్తూ దూసుకుపోతోంది. అయితే టాలీవుడ్ లో త‌మ‌న్నా ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అంద‌రితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే సీనియ‌ల్ హీరోల్లో వెంక‌టేష్‌, చిరంజీవి, నాగార్జున వంటి వారితో కూడా సినిమాలు చేసింది.

న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో మాత్రం త‌మ‌న్నా ఇంత వ‌ర‌కు ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. కానీ, గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ మిస్ అయింద‌ని మీకు తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ ఆ సినిమా మ‌రేదో కాదు.. అఖండ. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, బాల‌కృష్ణ క‌ల‌యిక‌లో వ‌చ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీ‌కాంత్‌, పూర్ణ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి థ‌మ‌న్ స్వ‌రాలు అందించాడు.

2021లో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. అప్ప‌టి వ‌ర‌కు వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అయిన బాల‌కృష్ణ ఈ మూవీతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమాలో బాల‌య్య భార్య‌గా, జిల్లా క‌లెక్ట‌ర్ గా ప్ర‌గ్యా అద‌ర‌గొట్టేసింది. ఆమె పాత్ర‌కు కూడా మంచి మ‌ర్కులు పడ్డాయి. అయితే అఖండ మూవీలో హీరోయిన్ రోల్ కు ఫ‌స్ట్ ఛాయిస్ ప్ర‌గ్యా కాదు త‌మ‌న్నా. మొద‌ట మేక‌ర్స్ త‌మ‌న్నానే సంప్ర‌దించారు. కానీ, అప్ప‌టికే త‌మ‌న్నా సీటీమార్, మాస్ట్రో, ఎఫ్ 3తో పాటు ప‌లు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కు క‌మిట్ అయింది. దీంతో డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక సున్నితంగా త‌మ‌న్నా అఖండ‌ను తిర‌స్క‌రించింది. అలా బాల‌య్య‌, త‌మ‌న్నా కాంబోలో ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ మిస్ అయిపోయింది.