ప్రభాస్ తలుచుకుంటే అది ఎంత పని.. కానీ ఎందుకు చేయడం లేదో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయినా సరే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అవ్వక తప్పదు . గాసిప్స్ రాని సెలబ్రిటీ ట్రోలింగ్ కి గురవని స్టార్స్ .. ఏ ఇండస్ట్రీలో లేరనే చెప్పాలి . అయితే ఎప్పుడు కూడా నెగటివ్ అంశాల పైన ట్రోలింగ్కి గురవుతారా..? అంటే నో అని చెప్పాలి. కొన్నిసార్లు పాజిటివ్ వేలో కూడా ట్రోలింగ్ చేస్తారు. ప్రెసెంట్ అలాంటి ట్రోలింగ్ కి గురవుతున్నారు టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ . ప్రెసెంట్ తాను నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే ఉండేలా చూసుకుంటున్న ప్రభాస్ ..కల్కి – సలార్ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు.

అయితే ప్రభాస్ తన వ్యక్తిగత జీవితంలో ఎంత టాప్ పొజిషన్లో ఉన్నాడో మనకు తెలిసిందే . కానీ ఆయన జాన్ జిగిడి దోస్త్ గోపీచంద్ మాత్రం ఇప్పటివరకు స్టార్ గా మారలేకపోయాడు . కెరియర్ లో స్టార్ గా స్టేటస్ సంపాదించుకున్న ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇప్పటికీ కెరియర్లో స్టడీ పొజిషన్ కి చేరుకోలేకపోయారు . ఈ క్రమంలోనే తన ఫ్రెండేమో అంత పెద్ద హీరో.. మరి గోపీచంద్ ని పైకి తీసుకురావచ్చుగా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అలాంటి వాళ్ళకి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఘాటుగా జవాబు ఇస్తున్నారు. నిజానికి ప్రభాస్ ఎన్నో సినిమాల విషయంలో గోపీచంద్ కు హెల్ప్ చేశారట. కానీ గోపీచంద్ మాత్రం తన సొంత కష్టం స్వయంకృషితోనే పైకి రావాలి అని ప్రభాస్ హెల్ప్ ఎక్కడ తీసుకోలేదట . అప్పటికి ప్రభాస్ గోపీచంద్ కి తెలియకుండా కొన్ని సినిమాల విషయంలో హెల్ప్ చేస్తున్న సరే గోపీచంద్ ఫైర్ అయిపోయే వాడట . అలా చేస్తే ఇక నీతో మాట్లాడను అంటూ మొండిగా చెప్పుకొచ్చేసేవారట . ఇప్పటికీ వీళ్ళ మధ్య ఈ విషయం కారణంగా గొడవలు జరుగుతూనే ఉంటాయట . అందుకే ప్రభాస్ గోపీచంద్ పర్సనల్ లైఫ్ విషయంలో కానీ కెరియర్ విషయంలో కానీ తల దూర్చడని కేవలం ఫ్రెండ్షిప్ పరంగా మాత్రమే ఆయనతో మింగిల్ అవుతూ వస్తున్నాడు అని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!