‘జవాన్’ లో మెరిసిన ఈ తెలుగు బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా..? అదృష్టాని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నట్లుందే..!!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజాగా నటించిన సినిమా “జవాన్”. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ అభిమానులు ఎలా అయితే ఆయనను చూడాలి అనుకుంటున్నారో చాలాకాలం తర్వాత అలాంటి లుక్స్ లో చూపించి అలాంటి ఓ కంటెంట్ ఉన్న సినిమాలో అట్లీ మనకు షారుక్ ఖాన్ చూపించి అభిమానుల కోరిక తీర్చేశారు . అందరూ బాలీవుడ్ -కోలీవుడ్ బ్యూటీసే..నతీనటులే ఉన్నారు ..తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరూ లేరు అని ఫ్యాన్స్ మొదటి నుంచి చాలా డిసప్పాయింట్ అయ్యారు.

అయితే సినిమాకెళ్లిన తెలుగు జనాలకు సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు అట్లీ . ఈ సినిమాలో తెలుగు బ్యూటీ కూడా ఉంది . ఆ బ్యూటీ మరెవరో కాదు ప్రముఖ యూట్యూబర్ సిరి హనుమంత్. బిగ్ బాస్ లో గ్లామర్ బ్యూటీగా ప్రధాన ఆకర్షణగా నిలిచిన సిరి హనుమంత్ ..తన స్నేహితుడు షణ్ముఖతో కలిసి ఎలాంటి యవ్వారాలు నడిపిందో మనకు తెలిసిందే. ఆ విషయం అటు ఉంచితే బిగ్ బాస్ తర్వాత సిరి పలు ఆఫర్స్ తో దూసుకుపోతుంది.. కొన్ని సినిమాల్లో మెరిసిన పెద్దగా గుర్తింపు రాలేదు.

ఈ సినిమాలో కూడా సిరి క్యారెక్టర్ పెద్దగా ఉండదు . కానీ షారుక్ ఖాన్ సినిమాలో ఆయన పక్కన నటించడం అంటే చాలా అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టాన్ని పట్టేసింది సిరి హనుమంత్. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ పక్కన సబర్డినేట్ పోలీస్ ఆఫీసర్గా మనకు కనిపిస్తుంది. ఒక్కటంటే ఒక్క డైలాగ్ లేదు కానీ స్క్రీన్ స్పేస్ మాత్రం బాగానే షేర్ చేసుకునింది. దీంతో అందరూ సిరి హనుమంతుని లక్కీ బ్యూటీ అంటూ ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు..!!