ఒరిజినల్ గొరిల్లాతో న‌టించ‌బోతున్న హీరోయిన్ అంజలి..!!

టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గీతాంజలి లాంటి పలు సినిమాల్లో అలరించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ శిష్యుడు మిలన్ దర్శకత్వంలో వస్తున్న గొరిల్లా సినిమాలో కీలక పాత్రలో నటించబోతుంది.

ఓ వినూత్న ప్రయోగానికి సిద్ధమైన అంజలి ఈ చిత్రంలో లేడీ ఓరియెంటెడ్ రోల్‌లో కనిపించ‌బోతుంది. ఓ మహిళకు.. గొరిల్లాకు మధ్య నడిచే ఎమోషనల్ డ్రామాతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. గొరిల్లాతో వచ్చే ఎపిసోడ్‌ల‌ను థాయ్లాండ్‌లో చిత్రీకరించబోతున్నారని.. ఇందులో శిక్షణ తీసుకున్న ఒరిజినల్ గొరిల్లా నటించనుందని సమాచారం. అలాగే గ్రాఫిక్స్ ప్రధానంగా కొన్ని ఎపిసోడ్‌ల‌ను తీర్చిదిద్దబోతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.