సుజిత్ – పవన్ మూవీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది యంగ్ డైరెక్టర్లలో సుజిత్ ఒకడు. ఈయన చేసిన సాహో సినిమా ఫ్లాప్ అయినా ఈ సినిమాని డైరెక్ట్ చేసిన సుజిత్ కి మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. ఇక ఈ సినిమా తర్వాత సుజిత్ కి బాలీవుడ్ హీరోల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా వాటిని కాదని తెలుగులో సినిమా చేయాలని మరి పట్టు పట్టుకుని పవన్ కళ్యాణ్ కి ఒక స్టోరీ చెప్పి ఆయనని ఒప్పించి ఆయనతో ఓజి సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇప్పటికే అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా విషయంలో సుజిత్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. నిజానికి సుజిత్ ఈ సినిమా చేయడానికి గల కారణం ఆయన పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అవ్వడం కూడా.. ఇది ఓ పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.. ఇక ఈ సినిమాలో అయిన ఒక క్యారెక్టర్ కోసం అలనాటి హీరోయిన్ ని తీసుకొస్తున్నట్టు గా సమాచారం.

ఆమె ఎవరు ఎవ‌రోకాదు.. పవన్ కళ్యాణ్ తో పాటు గోకులంలో సీత అనే సినిమాలో కలిసి నటించిన రాశి. ఈ మూవీ కోసం డైరెక్టర్ సుజిత్ ఆమెని తీసుకోబోతున్నట్లు గా తెలుస్తుంది. ఇక ఈ పాత్ర‌కి సుజిత్ చాలా మందిని అనుకున్నాడ‌ట‌. ఫైనల్ గా రాశిని తీసుకోవాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా కనుక హిట్ అయితే ఇక రాశికి అవకాశాలు క్యూ కడతాయని చెప్పొచ్చు. అలాగే మళ్లీ తను సినిమాల్లో బిజీగా మారిపోతుంది.