ఇష్టం లేకపోయిన హీరోయిన్స్ తో అలా చేసిన బన్నీ-నాని.. ఫ్యాన్స్ మాత్రం పిచ్చ హ్యాపీ..ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు తెలిసో తెలియకో ఒకే టైప్ ఆఫ్ కథను చూస్ చేసుకుంటూ ఉంటారు స్టార్ హీరోలు. అలా గతంలో వచ్చిన సినిమా స్టోరీలను కొంచెం రీ క్రియేట్ చేసి మళ్లీ తెరపై కొత్తగా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాగా ఒక్కొక్కసారి అలా చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అవ్వచ్చు.. కానీ కొన్నిసార్లు మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి . అలా ఉన్న సినిమాలలో బన్నీ – నాని సినిమాలో కూడా ఉన్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ తన కెరియర్ లో నటించిన సిక్వెల్ సినిమా ఆర్య 2 . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. హీరోగా బన్నీ ..సెకండ్ హీరోగా నవదీప్ నటించారు. కాజల్ నవదీప్ ను లవ్ చేస్తుంది.. పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కానీ కొన్ని అనివార్య కారణాల కారణంగా అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇక దీంతో పెళ్లి బంధానికి కట్టుబడిన కాజల్.. అల్లు అర్జున్ ని మాత్రం దూరంగా పెడుతూ వస్తుంది. అయితే అల్లు అర్జున్ తన ప్రేమను ప్రూవ్ చేసుకుని కాజల్ ని మార్చేస్తాడు.. కాజల్ కూడా మారిపోయి అల్లు అర్జున్ కు దగ్గరవుతుంది .

 

ఇదే కాన్సెప్ట్ తో నాని కూడా రీసెంట్గా మన ముందుకు వచ్చాడు . ఆ సినిమానే “దసరా”. ఈ సినిమాలో నాని – కీర్తి సురేష్ ల మధ్య కూడా ఇదే స్టోరీ నడుస్తుంది. ఇంచుమించు ఈ సినిమా స్టోరీ కూడా ఆర్య 2 లానే ఉంటుంది . మొదట వెన్నెల సెకండ్ హీరోని ప్రేమిస్తుంది.. ఆ తర్వాత అతగాడు చనిపోయిన తర్వాత నాని ఆమెను పెళ్లి చేసుకుంటాడు.. మొదటి నాని అంటే ఇష్టం లేని వెన్నెల ఆ తర్వాత నాని ని బాగా దగ్గర చేసుకుంటుంది ..ప్రేమిస్తుంది ఇలా ఇద్దరి హీరోలు తామంటే ఇష్టం లేని బ్యూటీస్ ని సినిమాల్లో పెళ్లిళ్లు చేసుకుని సక్సెస్ కొట్టారు..!!