రాత్రి నిద్రపోయే ముందు పాలు తాగితే.. ఇన్ని సమస్యల….!!

చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మరి నిద్రకు పాలు నిజంగా సహాయపడతాయా? మనలో చాలామందికి నిద్రపోయే ముందు పాలు తాగి పడుకోవడం అలవాటు. కానీ అనేక ఆయుర్వేదాల ప్రకారం నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల ప్రయోజనాల కంటే హాని ఎక్కువ. నైట్ టైమ్ పాలు తాగితే నిద్రకు ఆటంకం కలుగుతుంది.

కొందరికైతే కడుపు నొప్పి వస్తుంది. కాలేయం పనితీరుని మందగించేలా చేస్తుంది. రాత్రిపూట పాలు తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ కు అంతరాయం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిద్ర వేలకు ముందు పాలు తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఒక గ్లాసు పాలలో దాదాపు 120 క్యాలరీలు ఉంటాయి. ఈ క్యాలరీలు నిద్రపోతున్నప్పుడు తగినంతగా బర్న్ చెయ్యకపోవచ్చు.

ఇది బరువు పెరగడానికి సహాయపడుతుంది. రాత్రిపూట పాలు తాగడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. పాలు తాగిన వెంటనే పడుకుంటే జీర్ణక్రియ కష్టతరం చేస్తుంది. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం పాలు తాగడానికి ఉత్తమ సమయం నిద్ర వేలకు కనీసం రెండు నుంచి మూడు గంటల ముందు తాగవచ్చు. ఇది కూడా కొద్ది మొత్తంలో మాత్రమే తాగాలి.