బోయపాటికి బిగ్ ఛాన్స్ ఇచ్చిన తమిళ హీరో..? మన హీరోలు బుద్ధి తెచ్చుకోవాలా..?

ఈ మధ్యకాలంలో మన తెలుగు హీరోలు తెలుగు డైరెక్టర్లకి అవకాశం ఇవ్వడమే మానేస్తున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఉన్న బోయపాటి శ్రీనుకి ఏ స్టార్ హీరో అవకాశాలు ఇవ్వడం లేదు. కేవలం బాలయ్య తప్పిస్తే బోయపాటికీ మరి ఏ పెద్ద హీరో అవకాశము ఇవ్వడం లేదు. ఇదే విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది .

కాగా ప్రెసెంట్ రాం పోతినేనితో స్కంద మూవీని తెరకెక్కించిన ఆయన.. ఆ తర్వాత బాలయ్యతో మరో సినిమాకి కమిట్ అయ్యాడు అన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది . కాగా ఇలాంటి క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బోయపాటి డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది అంటూ పక్క సమాచారం అందుతుంది .

తెలుగు – తమిళ్ భాషలలో సరికొత్త కాంబినేషన్ గా ఈ సినిమా అభిమానులను అలరించబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే బోయపాటి శ్రీను అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు భయపడుతూ ఉన్న క్రమంలో కోలీవుడ్ సూర్య మన తెలుగు డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది . కొంతమంది తెలుగు జనాలు బోయపాటి ఫ్యాన్స్ సూర్య ని చూసి మన తెలుగు హీరోలు బుద్ధి తెచ్చుకోవాలని ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?