మొఖం మిలమిల మెరవాలనుకుంటున్నారా…. అయితే తప్పకుండా అలోవెరా రాయాల్సిందే…!!

ముఖం అందంగా, కాంతివంతంగా అవ్వాలని చాలామంది కోరుకుంటారు. అలాగే దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ ఏమీ ఫలించవు. ఎక్కువ డబ్బులు పోసి బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేపించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

వాటి వల్ల మొఖం ఇంకా దెబ్బతింటుంది. ఇప్పుడు మనం చెప్పుకో బోయే చిట్కాతో ముఖం అందంగా మార్చుకోవచ్చు. మన చుట్టుపక్కల దొరికే దానితో ముఖం కాంతివంతంగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అలోవెరా లో బోలెడన్ని విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. అలోవెరా జెల్ పొడిబారిన చర్మాన్ని వెంటనే హైడ్రేట్ చేస్తుంది.

అలోవెరా లో ఆస్ట్రింజెంట్ చర్మం మీద నలుపు మచ్చలను తొలగిస్తుంది. అలోవెరా జెల్ ఫేస్ మీద రాస్తే మురికి పోయి మెలమెలా మెరుస్తుంది. అలాగే ముఖం మీద ఉన్న మొటిమలను నివారిస్తుంది. కాలిన గాయాలను వేగంగా తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలోవెరా రాసుకుంటే చర్మం మీద ముడతలు మాయం అవుతాయి.