టాబ్లెట్ వేసుకున్న తర్వాత పాలు గాని ఈ ఆహార పదార్థాలు కానీ తినకూడదు కారణం ఇదే..!

ఎటువంటి ఆరోగ్య సమస్యకైనా సాధారణంగా అందరూ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది టాబ్లెట్స్ తో పాటు కొన్ని ఆహార పదార్థాలను కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ టాబ్లెట్ వేసుకున్న తరువాత ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.టాబ్లెట్స్ వేసుకునింగానే కొంతమంది టీ, కాఫీ, పాలను తాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

ఇలా తాగడం వల్ల వారు రిలీఫ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత పాలను తాగడం అసలు మంచిది కాదట. అదే విధంగా టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు ఎనర్జీ డ్రింక్స్ కూడా తీసుకోకూడదు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం పడడమే కాక మందు కూడా కరగడానికి చాలా సమయం పడుతుంది. టాబ్లెట్ వేసుకునేటప్పుడు ఆల్కహాల్ లేదా ఎటువంటి మత్తు పదార్థాలను తీసుకోకూడదు. ఇది ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపడమే కాదు రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల కాలేయానికి కూడా భారీ నష్టం జరుగుతుంది.

ఆల్కహాల్తో మందులు తీసుకోవడం వల్ల కాలేయానికి చాలా ప్రమాదాలు ఉన్నాయి. పాలతో మందులు తీసుకోవడం పూర్తిగా మానేయండి ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ పాలు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్నా.. కొన్ని యాంటీబయోటిక్స్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి. పాలల్లో కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్లు అంటే అనేక ప్రోటీన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఔషధాలతో కలిపి వాటి ప్రభావాన్ని తగ్గిస్తాయి. అందుకే పాల ఉత్పత్తులతో మందులను తీసుకోకూడదని నిపుణులు చెప్తున్నారు.