“నాకు అలాంటివన్ని అఫ్ట్రాల్”..స్టార్ హీరో సినిమాను ఇన్సల్ట్ చేసిన కాజల్ అగర్వాల్..!?

కాజల్ .. అ స్టార్ హీరో సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. మనకు తెలిసిందే కాజల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో టాలీవుడ్ ..కోలీవుడ్.. బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది . ఆ తర్వాత కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకున్న కాజల్ ..నీల్ కిచ్చులుకి జన్మనిచ్చింది . ఆ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ ప్రెసెంట్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . తన వద్దకు వచ్చిన ప్రతి సినిమాను యాక్సెప్ట్ చేయకుండా ఏ సినిమాలో నటిస్తే తన పాత్రకు తనకు బాగుంటుందో ఆలోచించి.. మరి అటువంటి సినిమాలను ఓకే చేస్తుంది .

రీసెంట్గా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆఫర్ ను కాజల్ అగర్వాల్ రిజెక్ట్ చేసింది అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . చిరంజీవి డైరెక్టర్ మల్లాడి వశిష్ట దర్శక్త్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో ఓ పాత్ర కోసం కాజల్ ను అప్రోచ్ అయ్యారట మేకర్స్. అయితే కేవలం బొమ్మలా కూర్చొని ఉండే పాత్రలో నేను నటించనని.. నటనకు ఇంపార్టెంట్ ఉండాలి.. నాకు ఆ క్యారెక్టర్ లో కాస్తో..కూస్తో.. ప్రాధాన్యత ఉండాలి ..అప్పుడే నటిస్తాను అంటూ తేల్చి చెప్పేసిందట .

అంతేకాదు కంటెంట్ లేని సినిమాలు నాకు ఆఫ్ట్రాల్ ..అలాంటి ఆఫర్ ఇచ్చి ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నేను చేయను అంటూ డైరెక్ట్ గా చెప్పేయడం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కాజల్ డెసిషన్ ని తన ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తూ ఉంటే .. మరికొందరు మాత్రం ఆమెకు హెడ్ వెయిట్ పెరిగింది అని అసలు నీకు ఆఫర్ రావడమే గొప్ప అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ చేస్తున్నారు..!!