బిగ్ బాస్ లో రోజుకొక రచ్చతో రసవత్తరంగా సాగుతుంది. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న బిగ్ బాస్ 7 లో గొడవలు, ఏడుపులు, వార్నింగ్లతో నాన్న హంగామా చేస్తున్నారు హౌస్ మేట్స్. మాయస్త్ర కోసం పోటీ పడుతున్న కంటిస్టెంట్స్ ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు. ఈ క్రమంలోనే రణధీర, మహాబలి టీమ్ పోటీ పడ్డే క్రమంలో హౌస్ లో ఉన్న వారి మధ్య వాదనలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే రణధీర టీమ్ మహాబలి టీమ్ పై విజయం సాధించి మాయాస్త్ర రెండో కీని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మాయాస్త్రను తలో ముక్క పంచుకున్నారు.
అలాగే బిగ్ బాస్ లో రెండో అస్త్ర సాధించేందుకు రణధీర టీం లో ఉన్న వారిలో నుంచి మాయాస్త్ర ముక్కలను తీసుకుని అదే టీమ్ లో ఉన్న వారిలో ఎవరో ఒకరికి ఇవ్వాలని.. అలా ఎందుకు ఇస్తారో సరైన రీజన్ చెప్పాలని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. గాంగ్ సౌండ్ విన్న వెంటనే మహాబలి టీమ్ లో ఉన్నవారు మాయాస్త్ర ముక్కలను తీసుకొని రణధీర టీమ్ లో ఉన్నవారికి ఇవ్వాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. మాయాస్త్ర భాగాలు రణధీర టీంలో ఏ ఇద్దరి సభ్యుల దగ్గర ఎక్కువ ఉంటాయో వారు.. పవరాస్త్ర గెలుచుకునేందుకు అర్హులుగా నిలుస్తారని తెలిపాడు బిగ్ బాస్.
రెండో అస్త్ర గెలుచుకున్న వారికి నాలుగు వారాల ఇమ్యూనిటీ వస్తుందని.. అలాగే ఎలిమినేషన్ నుంచి కూడా బయటపడతారని తెలిపాడు బిగ్ బాస్. ఈ క్రమంలో మహాబలి టీమ్ లో ఉన్నవారు నేను వెళ్ళను అంటే నేను వెళ్ళను అంటూ గొడవ పడ్డారు. ముఖ్యంగా రతిక ఈసారి చాలా డ్రామా చేసింది. ముందుగా శుభ శ్రీ, శోభా శెట్టి నుంచి మాయాస్త్ర భాగాన్ని తీసుకొని ప్రిన్స్ యావర్ కు ఇచ్చింది. పల్లవి ప్రశాంత్ అమర్ దీప్ దగ్గర నుంచి తీసుకుని శివాజీకి ఇచ్చాడు. తర్వాత అసలు డ్రామా మొదలయింది. రణధీర టీంలో శివాజీకి ఎక్కువ మాయస్త్ర భాగాలను ఇచ్చి ఆయనను విన్నర్ ను చేస్తా అంటూ తన టీం తో చెప్పింది రతికా.
అందుకు ఒప్పుకోలేదు టీం సభ్యులు. అలాగే రతిక నేను లాస్ట్ వెళ్తా అంటూ టీమ్ మెంబర్స్ తో చెప్పడంతో ఎవరు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే దామినిపై సీరియస్ అయింది రతిక. ” ఈ టీంలో ఉండాలంటేనే నాకు చిరాకు వస్తుంది.. ఇది పెద్ద బఫూన్ టీమ్.. అంటూ అందరి ముందు తిట్టేసింది రతిక. దీనితో ఎంతసేపు చూసినా ఎవరు ముందుకు రాకపోవడంతో సందీప్ వాళ్లపై సీరియస్ అయ్యాడు. ఏదేమైనా నేను లాస్ట్ లోనే వెళ్తాను అని రతిగా మొండిపట్టు పట్టుకుని కూర్చుంది. ఇంతలో షకీలా తన కంటెంట్ క్రియేట్ చేస్తుంది అంటూ ఫైర్ అవుతుంది.
రతిక ఇది మీకు కంటెంట్ లాగా కనిపిస్తుందా అమ్మ అంటూ మాట్లాడుతుంది. చివరికి దామిని వెళ్లి ప్రియాంక చేతిలో ఉన్న సగభాగం తీసుకుని షకీలా కి ఇస్తుంది. ఆ తర్వాత గౌతమ్ ప్రిన్స్ దగ్గర సగభాగం తీసుకోవడానికి వెళ్తే ప్రిన్స్ సీరియస్ అవుతాడు. వీరిద్దరూ కొట్టుకునే దాకా వెళ్తారు. ఇక్కడితో నిన్న ఎపిసోడ్ పూర్తయింది.