వామ్మో.. `చంద్ర‌ముఖి 2` ర‌న్ టైమ్ అన్ని గంట‌లా.. పెద్ద రిస్కే ఇది!

2005లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, డైరెక్ట‌ర్ పి. వాసు కాంబోలో వ‌చ్చిన హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ `చంద్ర‌ముఖి` ఎలాంటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర్వాత చంద్ర‌ముఖి మూవీకి సీక్వెల్ గా చంద్ర‌ముఖి 2 రాబోతోంది. ఈసారి రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తుంటే.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ రోల్ ను ప్లే చేసింది.

వడివేలు, రాధిక శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, సృష్టి డాంగే, రావు ర‌మేష్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందించారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రుగుంటే.. ఈ రోజే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేది. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల మేక‌ర్స్ సెప్టెంబ‌ర్ 28వ తేదీకి రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా చంద్ర‌ముఖి 2 మూవీ సెన్సార్ వ‌ర్క్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌ముఖి 2 ర‌న్ టైమ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. చంద్రముఖి 2 సినిమా 171 నిమిషాలు అంటే 2 గంటల 51 నిమిషాల దాకా రన్ టైం ఉంటుందట‌. ఇంత భారీ ర‌న్ టైమ్ అంటే.. ప్రేక్ష‌కుల స‌హ‌జానికి ప‌రీక్ష పెట్టిన‌ట్లే అవుతుంది. ఎంతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటే కానీ ఇంత డ్యూరేషన్ ఉన్న సినిమాలు స‌క్సెస్ అయిన సంద‌ర్భాలు లేవు. మ‌రి ఇంత పెద్ద రిస్క్ చేసి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న చంద్ర‌ముఖి 2 ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.