షారుఖ్ `జ‌వాన్‌` మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

ఈ వారం విడుద‌ల కాబోయే భారీ చిత్రాల్లో `జ‌వాన్‌` ఒక‌టి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ను రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తే.. విజ‌య్ సేతుప‌తి ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ రోల్ ను పోషించాడు. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ఇటీవల పఠాన్ మూవీతో భారీ హిట్ అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద పెను తుఫాన్ రేపిన షారుఖ్ ఖాన్‌.. జ‌వాన్ తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ను కొట్టాల‌ని చాలా ఉత్సాహంగా ఉన్నాడు. సెప్టెంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ భాష‌ల్లో జ‌వాన్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, ట్రైలర్లు సినిమాపై అంచ‌నాల‌ను పీక్స్ లోకి తీసుకెళ్లాయి. ప్ర‌మోష‌న్స్ తో మ‌రింత హైప్ పెంచుతున్నారు.

అన్న‌ట్లు బాలీవుడ్ లో న‌య‌న‌తార‌కు ఇదే డెబ్యూ మూవీ. కానీ, జ‌వాన్ కు న‌య‌న‌తార ఫ‌స్ట్ ఛాయిస్ కాద‌ని మీకు తెలుసా..? అవును, మొద‌ట ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత‌ను సంప్ర‌దించారట‌. అయితే అప్పుడే స‌మంత నాగ‌చైత‌న్య‌తో విడాకుల వ్య‌వ‌హారంలో బిజీగా ఉంది. దాంతో ఇష్టం లేక‌పోయినా స‌మంత జ‌వాన్ ను రిజెక్ట్ చేసింది. ఆ త‌ర్వాత న‌య‌న‌తార‌ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. 2021లో ప‌ట్టాలెక్కిన జ‌వాన్‌.. మ‌రో రెండు రోజుల్లో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. మ‌రి ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.