షారుక్ ఖాన్ జవాన్ ఫస్ట్ రివ్యూ.. సినిమా అదిరిపోయిందిగా గురు..!

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ హీరోగా, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న తాజా మూవీ జవాన్.. ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు అట్లీ ఎంతో గ్రాండ్ గా తెర‌కెక్కించాడు. పటాన్ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చిన షారుక్ అదే జోష్ తో జవాన్ సినిమాను కూడా మంచి హిట్ అవుతుందని నమ్మకంతో ఆయన అభిమానులు ఉన్నారు. సెప్టెంబర్ 7న జవాన్ పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సంవత్సరం మొదటిలో విడుదలైన పఠాన్ సినిమాతో షారుఖ్ బంపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్లకు పైగా భారీ కలెక్షన్లు రాబట్టింది. అదేవిధంగా దర్శకుడు అట్లీ తెర్కెక్కించిన సినిమాలన్నీ దాదాపు మంచి విజయాలు సాధించడంతో జవాన్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నయనతార తో పాటు సౌత్ ఇండియన్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కూడా షారుక్ ఖాన్ కు విలన్ గా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.

అదేవిధంగా ప్రతి సినిమాకి విడుదలకు ముందు ఆ సినిమా ఫలితం ఇదే అంటూ చెప్పే ఫిలిం క్రిటిక్‌ ఉమైర్ సంధు జవాన్ సినిమాని చూసినట్టు రివ్యూ ఇచ్చాడు. ఈ ఫిలిం క్రిటిక్ ఇచ్చిన రివ్యూ ప్రకారం.. జవాన్ సినిమా షారుక్ ఖాన్ లో ఉన్న టాలెంట్ మొత్తం బయటపెట్టింది. ఈ సినిమా షార‌క్‌కి కరెక్ట్ గా సెట్ అయిందంటూంటూ చెప్పుకొచ్చాడు. కథకు తగినట్టుగానే షారుఖ్ నటన, ఎనర్జీ పర్ ఫెక్ట్ గా సరిపోయాయట. బిజినెస్ పరంగా ఇండియన్ మూవీస్ లో భారీ కలెక్సన్లను సాధించి పాత రికార్డులను బద్దలు కొట్టేస్తుందని చెప్పుకొచ్చాడు.

ముఖ్యంగా షారుఖ్ వికలాంగుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి చాలా అద్భుతంగా మెప్పించాడని వెల్లడించాడు ఉమైర్ సంధు. మరోవైపు గతంలో షారుఖ్ నటించిన హ్యాపీ న్యూ ఇయర్ మూవీకి రివ్యూ ఇచ్చి 4.5/5 రేటింగ్ ఇస్తే.. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. పఠాన్ ఫ్లాప్ అని రివ్యూ ఇస్తే.. ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. జవాన్ మూవీ సూపర్ అని చెప్పాడు. కానీ మరీ ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి మరీ.