బాలీవుడ్ బిజీగా బ్యూటీ కియారా అద్వానీ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆరంభంలో కియారా ఓ ఇంటిది అయింది. ప్రియు సఖుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడుగులు వేసింది. పెళ్లైనా సరే సినిమాలు, స్కిన్ షో విషయంలో కియారా అస్సలు తగ్గట్లేదు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లను టేకప్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది.
ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో పాటు టాలీవుడ్ లోనూ ఓ సినిమా చేస్తోంది. అదే `గేమ్ ఛేంజర్`. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఓ భేటీలో కియారా సినిమాల ఎంపికలో తనకున్న నియమ నిబంధనలను బయటపెట్టింది. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్స్ లో అయినా నటించడానికి వెనకడుగు వేయనని.. కానీ స్టోరీ తనకు కనెక్ట్ అవ్వాలని అంటోంది కియారా.
ఎంత పెద్ద హీరో అయినా.. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా.. కథ నచ్చకపోతే మాత్రం చచ్చినా సినిమాకు సైన్ చేయనని కియారా తెగేసి చెప్పింది. డబ్బు కోసం కథ నచ్చకపోయినా నటించడం తనవల్ల కాదంటోంది. ఇక విజయాలు వెంట ఉన్నాయని విర్రవీగిపోయి.. ఆ మత్తులో ఏ సినిమా పడితే ఆ సినిమాకి సైన్ చేస్తే కెరీర్ నాశనం అవుతుందని, అందుకే సక్సెస్ వచ్చినప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరిస్తానని కియారా పేర్కొంది. దీంతో ఈ బ్యూటీ కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి.