పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కోట్లల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. పవన్ పై ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో రూపంలో చూపిస్తారు. తన అభిమాన హీరో కోసం ఏం చేయడానికి అయినా వెనకాడరు. ఈ క్రమంలోనే ఓ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ పై ఉన్న పిచ్చి ప్రేమను చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియోలో ఉన్న దాని ప్రకారం ఏపీకి చెందిన ఓ వీరాభిమాని పెళ్లి చేసుకుంటున్నాడు. అయితే అబ్బాయే కాదు.. అమ్మాయి కూడా పవన్ కళ్యాణ్ కు అభిమానే.. ఇంకేముంది.. మూడు ముళ్ళు పడిన శుభవేళ తమ అభిమాన నటుడి పార్టీ కండవాలనే వరమాలగా మార్చుకున్నారు. సాధారణంగా పెళ్లిలో వధూవరులు పూలదండలు మార్చుకోవడం ఆనవాయితీ కాగా.. ఇప్పుడు పవన్ అభిమానులు వినూత్నంగా ఆలోచించారు.
పూలదండలకు బదులుగా జనసేన పార్టీ కండవాలను ఒకరి మెడలో మరొకరు వేసుకుని ఔరా అనిపించారు. ఆ తర్వాత పెళ్లి పీటలపైనే కూర్చుని పవన్ మేనరిజాన్ని చూపిస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ జంట పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
పెళ్లి అనతరం కండువాలు మార్చుకున్న నూతన వధూవరులు pic.twitter.com/qv1TV4k2So
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2023