డబ్బులిచ్చి నామీద ఎటాక్ చేయించారు.. విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – హీరోయిన్ సమంత జంటగా నటించిన ఖుషి మూవీ ఇటీవల రిలీజై భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజై 3 రోజుల్లోనే రూ.70 కోట్ల భారీ కలెక్షన్ వసూలు చేయడంతో నిన్న వైజాగ్ లో ఈ సినిమా సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా జరిపారు మూవీ టీం. ఈ ఈవెంట్ లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఖుషి సినిమాకు వచ్చిన ఫేక్ కామెంట్స్, ఫేక్ వీడియోస్ పై స్పందించాడు.

విజయ్ దేవరకొండ స్టేజ్ పైకి వస్తూ వస్తూనే నా మీద, నా సినిమా మీద జరుగుతున్న ఈ ఎటాక్స్, ఈ బుక్ మై షో రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ వీడియోస్, అకౌంట్లు ఊరు పేరు లేకుండా తీసుకుని రేటింగ్స్, యూట్యూబ్ వీడియోలు కొందరు డబ్బులు పెట్టి మరి ఇవన్నీ చేపించారు అంటు చెప్పాడు. అయినా అవన్నీ దాటుకుని ఈరోజు ఇంత భారీ కలెక్షన్స్ తో మీ ముందు ఉన్నానంటే ఇదంతా మీ ప్రేమ వల్లేనంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. విజయ్ దేవరకొండ అలా మాట్లాడడంతో అక్కడ హాజరైన ఫ్యాన్స్ అంతా కరతాళ‌ ధ్వనులతో విజయ్ దేవరకొండను ప్రశంసించారు.

మీ అరుపులు కేకలు ఉంటుంటే ప్రస్తుతం ఈ విషయం గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ టాపిక్ ను డైవర్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. అయితే ఇప్పటివరకు ఫ్యాన్స్ వర్గాలు మాత్రమే ఈ విషయంపై మాట్లాడాయి. తాజాగా విజయ్ దేవరకొండ స్ట్రైట్ గా ఇలా ఫేక్ రేటింగ్స్ పెట్టారని మాట్లాడడంతో అంత అవసరం ఎవరికీ ఉంది అనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. గతంలో విజయ్ దేవరకొండకు యంగ్ హీరోతో గొడవలు జరిగాయి అంటూ న్యూస్ వైరల్ అయ్యాయి. ఒకవేళ ఈ ఫేక్ రేటింగ్స్ వెనక కుర్ర హీరో ఉన్నాడా అనే అంశం ప్రస్తుతం చర్య అంశం అయింది. నేరుగా విజయ్ దేవరకొండ క్లారిటీ ఇస్తే గాని ఎవరికీ ఆ హీరో ఎవ‌రో తెలియదు.