విజయ్ ఆంటోనీ కూతురు చనిపోయే ముందు లాస్ట్ గా మాట్లాడింది ఎవరితోనో తెలుసా..? కీలకంగా మారిన ఫోన్ కాల్…!

ఇది నిజంగా చాలా బాధ కలిగించే విషయమనే చెప్పాలి . కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చాలా చిన్న ఏజ్ లోనే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు – సన్నిహితులు – స్నేహితులు బాధపడిపోతున్నారు. కాగా మీరా చాలా యాక్టివ్ గా ఉండే అమ్మాయి అని కానీ గత కొంతకాలంగా ఆమె డిప్రెషన్ తో బాధపడిపోతుందని ..దానికి తగ్గ మెడిసిన్స్ కూడా వాడుతున్నారు అని.. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా తన నివాసంలో రాత్రి మూడు గంటల సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని ..ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళు గమనించి హాస్పిటల్ కి తీసుకెళ్లలోపే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

అయితే ఇలాంటి క్రమంలోనే కేసుని రిజిస్టర్ చేసుకున్న పోలీసులు ఈ కేసుని భిన్న విభిన్నంగా కూడా విచారణలో చేస్తున్నారు . అసలు మీరా ఎందుకు చనిపోవాలనుకునింది..? మీరాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి..? కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి నెలకొందా..? పోనీ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమన్నా ఫోర్స్ చేశారా? ప్రేమ లాంటి వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయా..? అసలు ఆమెతో లాస్ట్ ఫోన్ కాల్ మాట్లాడింది ఎవరు? ఏం మాట్లాడింది..?

ఆ మాటలు మాట్లాడిన తర్వాతే ఆమె సూసైడ్ చేసుకుందా..? అన్న కోణంలో విచారిస్తున్నారట . దీనిపై ఇప్పటికే పోలీస్ స్పెషల్ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఎన్ని ఇన్వెస్టిగేషన్లు చేసిన సరే విజయ్ ఆంటోనికి ఇది తీరని శోకం .. చనిపోయిన ఆయన కూతురు ఇక తిరిగి రాదు అని నమ్మాల్సిన నిజం..!!