టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. అత్త, అక్క, వదిన, పిన్ని, అమ్మ, భార్య వంటి పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరమైంది.
కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పొట్టి దుస్తులు ధరించి రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా సురేఖ వాణి… ఓ యంగ్ హీరోతో ఎఫైర్ నడుపుతుందని.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ లో ఒకప్పుడు హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ నటుడుకి కొన్ని రోజులు అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడట.
అలాంటి హీరోతో సురేఖ వాణి పార్టీలకు, పబ్బులకు తిరుగుతుందట. అంతేకాదు ఆమె ఇంటికి ఆ హీరో అప్పుడప్పుడు వస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఈ వార్త సోషల్ మీడియాలో రచ్చగా మారింది.