పెళ్లికి ముందే మొదటి పూజ చేసిన వ‌రుణ్‌ – లావణ్య.. పిక్స్ వైరల్..

టాలీవుడ్ నటినట్లు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఇద్దరు ఏడేళ్ల డేటింగ్‌కి ఫుల్ స్టాప్ పెట్టి మూడు నెలల క్రితమే అధికారికంగా అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ జంట అప్ప‌టినుంచి రోజు మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. తాజాగా వినాయక చవితి పూజ చేసి మరోసారి వార్తల్లో వైరల్ అవుతున్నారు. తమ ఇంట్లోనే కొణిదల నాగబాబు భార్య‌ పద్మజ సమక్షంలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కలిసి గణనాథుని పూజలు చేశారు.

పూజ త‌ర్వాత‌ తీసుకున్న ఫోటోలను వరుణ్‌తేజ్‌ instagram వేదికగా షేర్ చేసుకున్నాడు. హ్యాపీ వినాయక చవితి ఆరోగ్యం, సౌభాగ్యం ఉండాలని కోరుకుంటున్నాను. నిహారిక కొణిద‌ల ఐయామ్ మిస్సింగ్ యు అంటూ ట్యాగ్ చేశాడు. కాగ‌ పూజలో వరుణ్ – లావణ్య పెళ్లికి ముందే గణనాథుని పూజ ఘనంగా చేయడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఏ పని స్టార్ట్ చేసేటప్పుడు అయినా ముందుగా విఘ్నాలు తొలగిపోవాలని వినాయకుడికి పూజ చేయడం కామన్. ఎప్పటి నుంచో వస్తున్న అనవాయితి. ఇదే మాదిరిగా ఈ కాబోయే దంపతులు ముందుగా ఏకదంతుని పూజ చేయడం వల్ల వారి సంసార జీవితం సంతోషంగా ఉండబోతుందని మెగా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.