అల్లు అర్జున్ కు అరుదైన గౌర‌వం.. మ‌హేష్, ప్ర‌భాస్ త‌ర్వాత ఆ ఘ‌న‌త‌ బ‌న్నీదే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాకు కాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న తొలి నటుడు అల్లు అర్జునే కావడంతో.. ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే తాజాగా బన్నీకి మరో అరుదైన గౌరవం దక్కింది. లండ‌న్ లోని మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బ‌న్నీ మైన‌పు విగ్ర‌హం కోలువు దీర‌బోతోంది.

టాలీవుడ్‌కు చెందిన ప్రభాస్‌, మహేష్‌ బాబు మైనపు విగ్రహాలు మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఉన్నాయి. వీరి త‌ర్వాత ఆ ఘ‌న‌త ఇప్పుడు టాలీవుడ్ హీరోల్లో బ‌న్నీకే ద‌క్క‌బోతోంది. అల్జు అర్జున్ త్వరలోనే లండన్ మ్యూజియాన్ని సందర్శించబోతున్నారు. అలాగే తన మైనపు విగ్రహం తయారు చేయడానికి అవసరసమైన శరీర కొలతలను ఇవ్వనున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఎంతో మంది ప్రముఖుల మైనపు బొమ్మలు లండన్ మ్యూజియంలో కొలువై ఉన్నాయి. ఇప్పుడు వారి చెంత అల్లు అర్జున్ కూడా చేర‌బోతున్నాడ‌ని తెలియ‌గానే.. ఆయ‌న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కాగా, అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.