కొత్త అవతారం ఎత్తబోతున్న శ్రీ లీల.. కోట్లు తీసుకునే స్టార్ హీరోలకి కూడా దిమ్మతిరిగిపోయే షాక్ ఇది..!

ఎస్ ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల ప్రెసెంట్ చేతిలో పదికి పైగానే సినిమాలు పెట్టుకుని రాజ్యాన్ని ఏలేస్తుంది . త్వరలోనే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఇలాంటి క్రమంలోనే అమ్మడు తీసుకున్న నిర్ణయం అభిమానులకు షాకింగ్ గా అనిపిస్తుంది .

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న ఫార్ములాను ఫాలో అవుతున్న శ్రీ లీల కొత్తగా ప్రొడక్షన్ హౌస్ ను నిర్మించబోతుందట. ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా పలు సినిమాలను కూడా ఆమె నిర్మించడానికి ట్రై చేస్తుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . జనరల్గా సినిమా ఇండస్ట్రీలో సినిమాలు నిర్మించాలి అంటే చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి .. చాలా డేర్ కూడా ఉండాలి .

అయితే ఇండస్ట్రీకి వచ్చి పట్టుమంటే 10 ఏళ్ళు కూడా కానీ శ్రీలీల ఇంత త్వరగానే నిర్మాణరంగం వైపు అడుగులు వేస్తూ ఉండడంతో జనాలు షాక్ అయిపోతున్నారు. ఇంకా పక్కగా చెప్పాలంటే కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు కూడా నిర్మాణం వైపు అడుగులు వేయాలంటే భయపడిపోతున్నారు .. ఇంత చిన్న ఏజ్ లోనే శ్రీలీల ఈ నిర్ణయం తీసుకుందంటే దాని వెనక ఏదో పెద్ద ప్లాన్ ఉంటుంది అంటున్నారు అభిమానులు..!!