ఎయిర్ పోర్ట్ లో శృతిహాసన్ కు వేధింపులు….. వెంటపడ్డ వ్యక్తి (వీడియో)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల బాలయ్య బాబుతో వీరసింహా రెడ్డి, చిరు తో వాల్తేరూ వీరయ్య సినిమాలతో తిరుగులేని సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అదే ఫామ్‌లో దూసుకుపోతూ వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటుంది. తాజాగా శృతి హాసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. శృతిహాసన్ ని ముంబై ఎయిర్ పోర్ట్ లో గుర్తు తెలియని వ్యక్తి వెంటపడ్డాడు.

తన కార్ పార్కింగ్ ఏరియా వరకు వెంబడించిన ఆ వ్యక్తి వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్లాక్ కలర్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకున్న ఆ వ్యక్తి ఎవరనేది తెలియక పోయినప్పటికీ అతని..ప్రవర్తన నచ్చకపోవటం వల్ల శృతి భయభ్రాంతులకు గురైంది. దీంతో వెంటనే శృతి హాసన్ భయపడి అక్కడ నుంచి వెళ్లిపోయింది.

అంతేకాకుండా శృతి దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ఆ వ్యక్తి ట్రై చేస్తుండగా.. నువ్వెవరో నాకు తెలియదు అంటూ శృతి హాసన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఈ వీడియోను చూసిన ప్రేక్షకులు ” సెల్ఫీ తీసుకోవాలి కానీ ఇలా వెంబడించి బెదిరించడం కరెక్ట్ కాదని ” కామెంట్స్ చేస్తున్నారు.