తాతగారి నటన వారసత్వాన్ని పునికి పుచ్చుకొని 17 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 20 ఏళ్లకే స్టార్డమ్ ను సంపాదించుకున్నాడు. తన నటనా ప్రతిభ, అద్భుతమైన డాన్స్ టాలెంట్ తో ప్రేక్షకుల గుండెల్లో బలమైన ముద్ర వేశాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే రెండున్నర దశాబ్దాలు సినీ కెరీర్ లో ఎన్టీఆర్ ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు.
అందులో ఓ సూపర్ హిట్ మల్టీస్టారర్ మూవీ కూడా ఉంది. ఇంతకీ ఆ మల్టీస్టారర్ మూవీ మరేదో కాదు ఊపిరి. టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన సినిమా ఇది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ కార్తి హీరోలుగా నటించాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తే.. ప్రకాష్ రాజ్, జయసుధ, అనుష్క శెట్టి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఫ్రెంచి సినిమా `ది ఇన్‌టచబుల్స్` ఆధారంగా ఊపిరి మూవీని రూపొందించారు. 2016 మార్చి 25న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను అందుకుంది. ఇక ఈ సినిమాలో కార్తి పోషించిన రోల్ కు ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆరే. అయితే స్టోరీ నచ్చినప్పటికీ డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల ఎన్టీఆర్ ఈ మూవీని రిజెక్ట్ చేశాడు. మరో వాదన కూడా ఉంది. ఈ సినిమాలో నాగార్జునకు కార్తి పాత్ర సేవలు చేయాల్సి ఉంటుంది. పాదాలు కూడా పట్టుకోవాల్సి ఉంది. ఆ కారణంగానే ఎన్టీఆర్ ఊపిరి సినిమాను వదులుకున్నారు అన్న టాక్ కూడా ఉంది. ఏదేమైనప్పటికీ నాగార్జున, ఎన్టీఆర్ కాంబోలో ఓ మంచి సినిమా మిస్ అయిపోయింది.