“పెళ్లయింది కానీ..నాకు ఆ సంతోషమే లేదు”.. నరేష్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా .. నటుడిగా పేరు సంపాదించుకున్న నరేష్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో బాగా తెలిసిందే. కన్నడ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే పవిత్ర లోకేష్ తో డేటింగ్ చేస్తున్నాడు అన్న రూమర్ నిజమైనప్పటి నుంచి వీళ్ళ పేర్లు మరింత స్థాయిలో మారుమ్రోగిపోతున్నాయి . వీళ్లు పలు షోస్ కి ఈవెంట్స్ కి కూడా అటెండ్ అవుతూ ఉండడం గమనార్హం.

నరేష్ తన నటనలో 50 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు . ఈ క్రమంలోని ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి .కాగా లైఫ్ లో ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చిన నరేష్ ..తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ..రమ్య రఘుపతి పెట్టిన బాధలు మర్చిపోలేను అంటూ పరోక్షకంగా కామెంట్ చేశారు .

అంతేకాదు..” ఆమె దగ్గర నా బిడ్డ ఉండడం సేఫ్ కాదని ..అది అతడి ఫ్యూచర్ కి చాలా చాలా డేంజర్ అని ..అసలు ఆమెతో పెళ్లయిందే కానీ ఏనాడు నేను సంతోషంగా లేను అని ..ఆయన చెప్పుకొచ్చాడు”. అంతేకాదు ఆ తర్వాత పవిత్ర తన లైఫ్ లోకి రావడం చాలా హ్యాపీగా అనిపించిందని .. నన్ను నన్నుగా అర్థం చేసుకునే ఆవిడ దొరికినందుకు ..నాకు ఇంకా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు . దీంతో సోషల్ మీడియాలో నరేష్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!