“వరుస ఫ్లాప్స్ తో విసిగిపోయిన కీర్తి సురేష్ “..ఫ్యాన్స్ కూడా ఊహించని నిర్ణయం..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కాగ సినిమా ఇండస్ట్రీ అన్నాక హిట్లు ఫ్లాప్ లు సర్వసాధారణం అందరి హీరో హీరోయిన్స్ కి క్రేజీ క్రేజీ హిట్స్ పడాలంటే కుదరదు.. టైం బాగోలేనప్పుడు మనం తీసుకున్న డెసిషన్ స్ట్రాంగ్ గా లేనప్పుడు.. కొన్నిసార్లు ప్లాప్ అవుతూ ఉంటాయి . అయితే అంతమాత్రానికి సినిమా ఇండస్ట్రీకి మనం పనికి రాము అనుకోవడం మూర్ఖత్వం . అయితే వరుసగా ఒకదాని తర్వాత ఒక సినిమా ఫ్లాప్ అవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనలో ఏదో మిస్టేక్ ఉందని.. మనం ఏదో తప్పు చేస్తున్నామని అర్థం.

ఆ తప్పుని లేటుగా రియలైజ్ అయింది మహానటి కీర్తి సురేష్ . టాలీవుడ్ నేటి జనరేషన్ కు మహానటిగా మారిన కీర్తి సురేష్ .. ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ స్ధానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా మహానటి తర్వాత అంతటి క్రేజీ హిట్ ఇప్పటివరకు కీర్తి సురేష్ అందుకోలేదు . ఈ క్రమంలోనే అవకాశాలు వస్తున్నా సరే ఒక్కటంటే ఒక హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోతున్న కీర్తి సురేష్ .. ఇక పై అలాంటి క్యారెక్టర్స్ చేయను అంటుందట.

రీసెంట్గా ఆమె నటించిన భోళాశంకర్ సినిమా సైతం ఫ్లాప్ అయింది . అంతేకాదు కీర్తి సురేష్ అంతకుముందు చెల్లెలిగా నటించినా పెద్దన్న సినిమా సైతం డిజాస్టర్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ మరో కోలీవుడ్ డైరెక్టర్ ఆమె వద్దకు మరో సిస్టర్ సెంటిమెంట్ పాత్రను తీసుకొని వచ్చారట . అయితే నేను చేయను అంటే చేయను అంటూ చేతులెత్తి దండం పెట్టేసిందట మహానటి . అంతేకాదు ఇప్పటినుంచి స్క్రిప్ట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని.. జనాలకు ఎలాంటి రోల్స్ చేస్తే నచ్చుతుందో అలాంటి రోల్సే చేస్తానని చెప్పుకొస్తుందట . అంతేకాదు గ్లామర్ డోస్ పెంచడానికి సైతం సిద్ధంగా ఉన్నానని అటువంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి అయినా సిద్ధమంటూ చెప్పుకొస్తుందట. దీంతో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ తీసుకున్న నిర్ణయం వైరల్ గా మారింది..!!