RC -16 లో బాలీవుడ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారా..?

రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం గేమ్ చేంజర్.. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC -16 సినిమా షూటింగ్ కు సిద్ధం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ పరంగా ఓకే అయ్యిందని ఈ సినిమా చేయడానికి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే ప్లాన్లో ఉన్నారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Would Ram Charan and Charmme Kaur be apt if 'Baaghi' was remade in south;  check full list

అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వివరాలు లీక్ అవ్వలేదు.. కానీ బుచ్చిబాబు అన్ని రకాలుగా సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది.. అయితే ఇందులో విలన్ గా విజయ్ సేతుపతిని తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఢీకొట్టేందుకు బాలీవుడ్ నటుడిని రంగంలోకి దించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. అతను ఎవరో కాదు టైగర్ ష్రాఫ్.

బుచ్చిబాబు ఈ నటుడిని తీసుకుంటే బాగుంటుందని అందుకోసమే రంగంలోకి దించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తను ఎంచుకున్న ఈ పాత్రకి కొత్త నటుడు అయితే బాగుంటుందని ఫిజిక్ పరంగా రామ్ చరణ్ కి మ్యాచ్ చేయాలి అంటే టైగర్స్ ష్రాఫ్ అయితే బాగుంటుందని ప్రేక్షకులు కూడా కొత్త అనుభూతి కలుగుతుందని బుచ్చిబాబు భావిస్తున్నట్లుగా సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇప్పటివరకు టైగర్ ష్రాఫ్ తెలుగులో ఏ సినిమాలో కూడా నటించలేదు.. ఫస్ట్ టైం ఈ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.