బిగ్ బ్రేకింగ్: పుష్ప2 రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఆ స్పెషల్ డేనే.. నీ యవ్వ ఇక తగ్గేదేలే..!!

ప్రజెంట్ సినీ లవర్స్ ఎంతో ఇష్టంగా.. ఈగర్ గా .. ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకేక్కిన పుష్ప వన్ సినిమాకి సీక్వెల్ గా పుష్ప2 సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఐకాన్ హీరో అల్లు అర్జున్ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు . అప్పటివరకు ఫుల్ టు ఫుల్ క్లాస్.. రొమాంటిక్ లుక్స్ లో కనిపించిన బన్నీను మాస్ లుక్ లో కూడా చూపించి హిట్ కొట్టిన ఘనత కేవలం సుకుమార్ కే దక్కింది .

కాగా పుష్ప సినిమా రిలీజ్ అయి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకు తెలిసిందే . ఈ సినిమా ఎన్నో అవార్డులను సాధించింది . అంతే కాదు రీసెంట్గా ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు జనాలు వెయిట్ చేస్తున్న ఉత్తమ జాతీయ నటుడు అవార్డు సైతం ఈ సినిమాకి గాను బన్నీకి వరించింది . దీంతో పుష్ప2 పై ఫుల్ హైప్స్ పెంచేసుకున్నారు అభిమానులు . ఇలాంటి క్రమంలోనే సుకుమార్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పుష్ప2 రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు .

అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప2 సినిమా ఆగస్టు 15 2024వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్ లో ఈసారి గ్లోబల్ స్థాయిలో హిట్ కొట్టడానికి రెడీ అయిపోయింది అంటూ అఫీషియల్ గా ప్రకటన చేశారు . దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ సంబరాలు చేసుకుంటున్నాడు. ఈసారి మన పుష్ప గాడు థియేటర్స్ ని బ్లాస్ట్ చేసేస్తాడు తన పెర్ఫార్మెన్స్ తో అంటూ ఓ రేంజ్ లో ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు కొంతమంది పుష్ప గాడు వచ్చేస్తున్నాడురోయ్ నీ యవ్వ ఇక తగ్గేదేలే అంటూ సినిమా డైలాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు . మొత్తానికి మన పుష్ప గాడు చాలా స్పెషల్ డే నే రాబోతున్నాడు . చూద్దాం మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో బన్నీ..!!