వామ్మో..బన్నీకి అవి అంటే అంత పిచ్చా..? ఆ రెండు లేనిదే సినిమా ముందుకు కదలదా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నా సరే ఎక్కువ మంది హీరోలు బన్నిని లైక్ చేస్తూ ఉంటారు . దానికి కారణం ఆయన స్టైల్ ..ఆయన ఆటిట్యూడ్ .. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ..ఆయన బిహేవియర్ . ఇలా అన్ని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు .

ప్రజెంట్ పుష్ప సినిమాతో గ్లోబల్ స్థాయిలో తన పేరు మారు మ్రోగిపోయేలా చేయడానికి ట్రై చేస్తున్నారు . కాగా అలాంటి బన్నీ సెంటిమెంట్స్ ఎక్కువగా నమ్ముతారు .. ఫాలో అవుతారట . బన్ని తన సినిమాల విషయంలో రెండు సెంటిమెంట్లను ప్రధానంగా ఫాలో అవుతారని ..సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన నటించిన సినిమాలు ఏప్రిల్ నెలలో విడుదల అయితే కచ్చితంగా సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధిస్తుందని బన్నీ బలంగా నమ్ముతాడట.

అంతేకాదు ఆయన నటించిన సినిమాలలో వైజాగ్ కి సంబంధించిన ఏ సీను ఉన్నా సరే సినిమా చరిత్రను తిరగరాస్తుందని ..సూపర్ డూపర్ హిట్ అవుతుందని బన్నీ ఎక్కువగా నమ్ముతాడట . ఈ రెండు సెంటీమెంట్లను ఎక్కువగా ఫాలో అవ్వడానికి అల్లు అర్జున్ ట్రై చేస్తాడట. దీంతో బన్నీకి సంబంధించిన ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!