అనుష్క మ‌ల‌యాళం ఎంట్రీ వెరీ కాస్ట్లీ.. ఆ 2 సినిమాల‌కు స్వీటీ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి మల‌యాళం ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ ఈ బ్యూటీ ఒక‌టి కాదు ఏకంగా రెండు సినిమాల‌కు సైన్ చేసింది. అందులో `కథానార్` ఒక‌టి. య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో తెర‌కెక్కుతున్న హర్రర్ థ్రిల్లర్ ఇది. ఇందులో జయసూర్య హీరోగా న‌టిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో అనుష్క రోల్ ఛాలెంజింగ్‌గా ఉండ‌బోతోంది.

రోజిన్‌ థామస్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఏకంగా 14 భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అనుష్క మ‌ల‌యాళంలో సైన్ డెబ్యూ మూవీ ఇది. అలాగే దీంతో పాటు మ‌ల‌యాళంలో `ఒట్టకొంబన్` అనే మ‌రో సినిమాలు అనుష్క గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే ఈ 2 సినిమాల‌కు అనుష్క పుచ్చుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సినిమాకు రూ. 5 కోట్లు చొప్పున అనుష్క ఛార్జ్ చేస్తుంద‌ని ఇన్ సైడ్ టాక్ న‌డుస్తోంది. అంటే రెండు సినిమాల‌కు క‌లిసి అనుష్క రూ. 10 కోట్లు అందుకుంటోంది. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు అనుష్క మ‌ల‌యాళం ఎంట్రీ వెరీ కాస్ట్లీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, లాంగ్ గ్యాప్ త‌ర్వాత అనుష్క నుంచి మ‌రో రెండు రోజుల్లో `మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి` సినిమా రాబోతోంది. న‌వీన్ పోలిశెట్టి ఇందులో హీరోగా న‌టించాడు. సెప్టెంబ‌ర్ 7న ఈ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ సౌత్ లో గ్రాంగ్ రిలీజ్ కాబోతోంది.