అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి.. 20 ఏళ్ల తరువాత ఆ స్టార్ హీరోతో నటించబోతున్న స్నేహ..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం.. రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరి టైం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరు గెస్ చేయలేరు . ప్రతిసారి హీరోయిన్ లు అన్నాక అందరికీ నెగిటివ్ గానే జరుగుతుందా అంటే నో అని చెప్పాలి. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ హీరోయిన్ స్నేహ . సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామరస్ ప్రపంచం అని అంతా అంటుంటారు. అయితే గ్లామర్ గా కనిపించడం అంటే చిట్టి పొట్టి బట్టలు వేసుకొని ధైస్.. ఎదభాగాలను ఎక్స్పోజ్ చేయడం కాదు .. పట్టు చీరలో సైతం మహాలక్ష్మి లా కనిపించి అభిమానులను ఆకట్టుకోవడమే అంటూ ప్రూవ్ చేసుకునింది స్నేహ .

సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్లు గడుస్తున్న.. ఇప్పటికి స్నేహ ఎక్స్పోజింగ్ చేయకపోవడం గమనార్హం . అయితే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ లోను.. క్రేజ్ లోను ఎలాంటి డౌన్ ఫాల్ లేదు . కాగా సెకండ్ ఇన్నింగ్స్ లో స్నేహ తనదైన స్టైల్ లో మంచి మంచి అవకాశాలతో దూసుకుపోతుంది . అలాంటి స్నేహకు మళ్ళీ మంచి అవకాశం దక్కింది . కొలివుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దళపతి 68వ చిత్రంలో ఆమె హీరోయిన్ గా సెలెక్ట్ అయింది .

వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు . ఈ క్రమంలోనే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేవిజయ్ కు భార్యగా స్నేహాన్ని చూస్ చేసుకున్నారట మేకర్స్. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబో సెట్ అయినందుకు ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో విజయ్ – స్నేహకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది . దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!