రామ్ చరణ్ సినిమాలో స్టార్ హీరో విలన్.. బాక్స్ ఫీస్ దద్దరిల్లాల్సిందే..!!

మెగా ఫాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్..RRR సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. అలాగే హీరోయిన్ అంజలి కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తూ ఉన్నారు రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది.

Ram Charan locks his next with Buchi Babu Sana | Telugu News - The Indian  Express

ఈ సినిమా అయిపోయిన వెంటనే రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్టు గురించి ఇప్పటికి అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వరకు కూడా జరుగుతోంది.త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు కాబోతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు గురించి అనేక రూమర్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మెగా అభిమానులకు కిక్కించే న్యూస్ వైరల్ గా మారుతోంది.

బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది మొదటి నెలలో ప్రారంభం కాబోతున్నది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం బుచ్చిబాబు ఒక పవర్ ఫుల్ పాత్రని సెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపైన ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ క్లారిటీ అయితే రాలేదు.. ఒకవేళ ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా షేర్ చేయడం ఖాయమని మెగా అభిమానులు భావిస్తున్నారు.