“అలా జరుగుంటే ఎంత బాగుండో”.. అమల పై స్టార్ హీరో కామెంట్స్ వైరల్..!!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సంజయ్ కపూర్ పోస్ట్ చేసిన లేటెస్ట్ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే సంజయ్ కపూర్ సినిమాలో పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నిజానికి సంజయ్ కపూర్ కెరియర్ స్టార్టింగ్ లో హీరోగా పలు సినిమాలు చేశారు . ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడంతో .. ఆ తర్వాత మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలోకి జంప్ అయిపోయారు.

రీసెంట్గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్న సంజయ్ కపూర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అక్కినేని అమలతో క్లోజ్ గా దిగిన ఫోటోలు షేర్ చేశారు . దీనితో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారిపోయింది . అయితే దీనికి క్లారిటీ ఇస్తూ ” 1987లో ఓ ప్రాజెక్టు కోసం సంజయ్ కపూర్ అమలను హీరో హీరోయిన్లుగా అనుకున్నారట. దీనికి సంబంధించి ఫోటోషూట్ కూడా చేశారట . కానీ లాస్ట్ కి ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయింది అని .. ఆ కారణంగానే అమలతో నటించే ఛాన్స్ చేసుకున్నానని చెప్పుకొచ్చారు”.

“అంతేకాదు అన్ని కలిసి వచ్చి ఉంటే నా కెరియర్ స్టార్టింగ్ అమలతో మొదలయ్యేది..” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ ఫోటో పై జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉండడంతో అక్కినేని అభిమానులు ఘాటుగా కౌంటర్ వేస్తున్నారు. మొత్తానికి ఒక్క ఫోటో తో సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాడు సంజయ్..!!

 

 

View this post on Instagram

 

A post shared by Sanjay Kapoor (@sanjaykapoor2500)