ఆ రోజు ఆడవాళ్ళు తనికెళ్ళ భరణి కొట్టడానికి వచ్చారా..? అంత పెద్ద తప్పు ఏం చేసాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అభిమానులు ఆయనను ఎంతలా ఆరాధిస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు 30 ఏళ్లకు పైగా తెలుగు సినీ పరిశ్రమల్) తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ముందుకు దూసుకెళ్తున్న భరణి.. రైటర్గా తన ప్రస్థానం మొదలుపెట్టి .. ఆ తరువాత నటుడుగా ఎన్నో పాత్రులకు జీవం పోసాడు ..కొన్ని సినిమాలకు దర్శకుడిగా ..మరికొన్ని సినిమాలకు రచయితగా పనిచేసి.. తన ప్రత్యేకతను చాటుకున్న తనికెళ్ల భరణి ..కెరియర్ మొదట్లో కొన్ని విలన్ పాత్రలు కూడా చేశారు . అతి భయంకరమైన విలన్ పాత్రలో కూడా ఆయన మెప్పించాడు. క్రూరత్వం అంటే ఆయన యాక్టింగ్ లో తాండవం చేసేది .

ఒకప్పుడు తెరపై తనికెళ్ళ భరణి ని చూస్తే ఆడవాళ్లు తిట్టుకునే వాళ్ళు ..అంత బాగా నటించి మెప్పించాడు తనికెళ్ల భరణి. ఈ క్రమంలోనే రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకానొక టైం లో తనని ఆడవాళ్లు కొట్టడానికి వచ్చారు అని చెప్పుకొచ్చారు . తనికెళ్ల భరణి మాట్లాడుతూ “మాతృదేవోభవ సినిమా టైంలో నేను హీరోయిన్ ఏడిపించేటప్పుడు చాలా ఇన్వాల్వ్ అయిపోయాను ..అతి క్రూరమైన కిరాతకమైన విలన్ పాత్రలో నటించాను.

ఈ సినిమా ఆ టైంలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో విలన్ పాత్ర చేసిన నేన్ను బయట కి వెళ్లినప్పుడు మహిళలు కొంతమంది కోపం పెంచుకున్నారట. ఇదే క్రమంలో ఆయనను బయట చూసిన సరే మహిళలు తిట్టేవారట .. కొందరు కొట్టడానికి కూడా ముందుకు వచ్చేవారట”. . అంతలా తన నటనతో ప్రజల్లో చెరగని ముద్రను వేసుకున్నాడు తనికెళ్ల భరణి..!!