ఆ కోరిక తీర్చుకోవ‌డం కోసం అంద‌రిని భ‌య‌పెడుతోన్న అన‌న్య నాగ‌ళ్ల‌..!

టాలీవుడ్ లో మల్లేశం, వకీల్ సాబ్ సినిమాలతో మంచి నటిక తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ అనన్య నా గళ్ల‌.. గత కొంతకాలంగా వరుస సినిమా అవకాశాలు రాకపోవటంతో సోషల్ మీడియాకే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన గ్లామర్ హాట్ ఫోటోలతో తన క్రేజ్ ను పెంచుకునే పనిలో పడింది. అయితే ఎంతగా గ్లామర్ చూపించిన తనకు సరిపడా అవకాశాలు అయితే రావడం లేదు.

కానీ ఓ మీడియం రేంజ్ నటిగా రానిస్తుందనే చెప్పాలి. అదేవిధంగా సోలో హీరోయిన్‌గా హిట్‌ కొట్టేందుకు ఆమె ఎంతగానో ట్రై చేస్తుంది గాని అది వర్కౌట్ అవ్వటం లేదు. ఇప్పుడు ఈమో తాజాగా తను ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా తంత్ర.. హర‌ర్ అండ్ య‌క్ష‌న్‌ థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్టర్ చూస్తుంటే ఈసారి కచ్చితంగా అనన్య కోరిక తీరుతుందని అనిపిస్తుంది.

ఆ పోస్టర్‌లో ముఖ్యంగా భయంకరమైన క్షుద్ర శక్తులు అనన్యని పట్టి పీడిస్తున్నట్టుగా అర్థమవుతుంది.. అదేవిధంగా దివంగత టాలీవుడ్ అగ్ర నటుడు శ్రీహరి తమ్ముడు కొడుకు ధనుష్ ఈ సినిమాతో హీరోగా టాలీవుడ్ లో పరిచయం అవుతున్నాడు..అదేవిధంగా మరొక కీలకపాత్రలో మరో అగ్ర నటి సలోని కూడా ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తుంది. అదేవిధంగా మన భారతీయ తంత్ర శాస్త్రానికి చెందిన విస్తు గొలుపే ఎన్నో రహస్యాలను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్లు చిత్ర బృందం చెప్పుకొచ్చింది.

ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాస్‌ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ‘ఫిమేల్ ఓరియెంటెడ్‌ లైన్‌తో రూపొందుతున్న ఈ హారర్‌ ఎంటర్‌టైనర్ భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాధల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది” అని దర్శకనిర్మాతలు తెలిపారు.