సింగర్ మధుప్రియ తన భర్త నుంచి విడిపోవడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్ మధుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫోక్ సింగర్ గా మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె స్టేజ్ పైన ఎన్నో అద్భుతమైన పాటలను పాడి ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఇమే సింగర్ గా ఇండస్ట్రీలోకి ఎంత ఇచ్చి పలు పాటలను పాడింది.ముఖ్యంగా ప్లేబ్యాక్ సింగర్ గా బాగానే అలరించిన ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. మధుప్రియ పెళ్లి సమయంలో జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే.

మధుప్రియకు 18 ఏళ్లు రాగానే తాను ప్రేమించిన శ్రీకాంత్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నది. అయితే వివాహం చేసుకున్న సమయంలో శ్రీకాంత్ నేను ప్రేమించుకుని వివాహం చేసుకున్నామని ఈ ప్రేమకు తమ తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారని తల్లితండ్రుల పైన తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత తన భర్త శ్రీకాంత్ అని కట్నం తేవాలంటూ వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పెద్ద ఎత్తున ఈ విషయం వైరల్ గా మారింది.

Madhu Priya (Singer) Height, Weight, Age, Husband, Biography & More »  StarsUnfolded

కుటుంబాన్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోకూడదని ఈమె తల్లితండ్రులు గొప్పతనం గురించి మరొకసారి అందరికీ హితబోధ చేయడం జరిగింది.అయితే ఈ కేసు పెట్టి 24 గంటల్లోనే మధుప్రియ మళ్ళీ వెనక్కి తీసుకుంది. అలా 18 సంవత్సరాలకే వివాహం చేసుకున్న మధుప్రియ ప్రస్తుతం తన భర్త నుండి విడాకులు తీసుకొని దూరంగా ఉంటోంది.అయితే ఈ విడాకులకు కారణం ఏంటనే విషయంపై పలు ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది .అదేమిటంటే శ్రీకాంత్ తనని పలు స్టేజి షోలపై పాల్గొనడానికి అంగీకరించేవారు కాదట నువ్వు ఇలా ఎక్కడపడితే అక్కడ స్టేజ్ పై పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటే తమ ఇంటి పరువు పోతుందని అందుకే ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదంటూ కండిషన్స్ కూడా పెట్టారట. దీంతో ఆమె భవిష్యత్తు ఉండదని తెలిసి మధుప్రియ తన భర్తను ఎదిరించి మరి విడాకులు తీసుకొని తన తల్లిదండ్రుల దగ్గరే ఉన్నట్లు తెలుస్తోంది.