ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. టాలీవుడ్ స్టార్ హీరో వైఫ్ ఆమె!

పైన ఫోటోలో క‌నిపిస్తున్న హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? ఆమె టాలీవుడ్ స్టార్ హీరో వైఫ్. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే పెళ్లి చేసుకుని పెద్దింటికి కోడ‌లు అయింది. వివాహం అనంత‌రం న‌ట‌న‌కు దూర‌మై గృహిణిగా మారింది. ఈపాటికే ఆమె ఎవ‌రో మీరు గెస్ చేసి ఉంటారు. ఎస్‌.. ఆమె అమ‌ల అక్కినేని. కెరీర్ ఆరంభంలో దిగిన ఫోటో ఇది.

అమ‌ల ప‌క్క‌న ఉన్న‌ది మ‌రెవ‌రో కాదు బాలీవుడ్ హీరో సంజయ్ కపూర్. 1986లో `మైథిలి యెన్నై కడలి` అనే కోలీవుడ్ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన అమ‌ల‌.. ఆ త‌ర్వాత సంజయ్ కపూర్ కు జోడీగా బాలీవుడ్ లో త‌న డెబ్యూ మూవీకి క‌మిట్ అయింది. 1987లో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా మొదలైంది. సంజయ్ క‌పూర్‌, అమ‌ల‌పై ఫోటోషూట్ నిర్వహించారు. సంజయ్ కపూర్ కి ఇది డెబ్యూ మూవీ కావడమే కాదు ఫోటోషూట్ కూడా మొదటిదే. అయితే అనూహ్యంగా ఈ సినిమా షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఆ త‌ర్వాత అమ‌ల తెలుగు, తమిళ్‌, మలయాళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్ గా బిజీ అయిపోయింది.

కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే నాగార్జున‌ను వివామం చేసుకుని అక్కినేని వారింటికి కోడులు అయింది. అమ‌ల‌తో సినిమా ఆగిపోయిన 8 ఏళ్ల త‌ర్వాత సంజ‌య్ వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు. తాజాగా సంజ‌య్ క‌పూర్ ఇన్‌స్టాలో అమ‌ల‌తో దిగిన ఫోటోను పంచుకుంటూ.. `నా మొదటి ఫోటోషూట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ అమలతో జరిగింది. కానీ ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది అంటూ` క్యాప్షన్ పెట్టాడు. ఇక ఈ పోస్ట్ చూసిన సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్.. `ఆ టైమ్ లో నాకు 14 ఏళ్లు` అంటూ ఫ‌న్నీగా కామెంట్ పెట్టింది. మొత్తానికి సంజ‌య్ క‌పూర్‌, అమ‌ల ఓల్డ్ ఫోటో మాత్రం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Kapoor (@sanjaykapoor2500)