ఎన్నికల ముందు గట్టి ప్లాన్ వేస్తున్న పవన్ కళ్యాణ్.. సక్సెస్ అయ్యేనా..?

పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా పవన్ కళ్యాణ్ కు గట్టి మార్పు తీసుకువచ్చేలా చేసింది. ఎలక్షన్ల వరకు సినిమాలే వద్దనుకున్న పవన్ కళ్యాణ్ కాస్త పూర్తిగా మారిపోయినట్లుగా తెలుస్తోంది. ఆగినవి అట్టకెక్కినవి అన్నీ కూడా ఒకేసారి షూటింగ్ మొదలుపెట్టి ఎన్నికల ముందే ఆడియన్స్ ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్. రాబోయే చిత్రాలలో పవన్ కళ్యాణ్ మరింత పొలిటికల్ వేడి పెంచబోతున్నట్లు పలు రకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆకాశం లాంటి వాడిని ఎప్పుడు ఉరుముతాడో ఎప్పుడు శాంతంగా ఉంటాడో ఎప్పుడు ముంచుతాడు అంచనా వేయడం కష్టమే అనే సినిమాల విషయంలో కూడా అలానే ఉంటానంటూ పలుకు డైలాగులు కూడా సినిమాలలో తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఉస్తాద్ ,వీరమల్లు,OG వంటి సినిమాలు ఎలక్షన్లు అయిపోయిన తరువాతే చేయాలనుకున్నారు. కానీ ఇంతలోనే ఒక సడన్ ట్విట్ ఇవ్వడం జరిగినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా తో ఒక్కసారిగా లెక్కలు మారిపోయినట్టు కనిపిస్తోంది.ఎలక్షన్ల వరకు సినిమాలే వద్దనుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాధ్ సినిమాని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

OG - Plot, Cast, Release Date and more

ఈ క్రమంలోనే హరీష్ శంకర్ మంగళవారం వెళ్లి పార్టీ ఆఫీసులో పవన్ ను కలిసినట్లు సమాచారం. అన్ని కుదిరితే ఆగస్టు 15న ఈ సినిమా షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పొలిటికల్ వేపన్ గా వాడుకోవాలని చూస్తున్నారు. కావలసినంత వినోదంతో పాటు పొలిటికల్ సెటైర్లు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ తో ఉన్నట్లు సమాచారం.

OG సినిమాకి కూడా మోక్షం వచ్చేలా కనిపిస్తోంది మరో 40 రోజులు సూట్ చేస్తే ఈ సినిమా కూడా పూర్తి కాబోతోంది.సెప్టెంబర్ లో ఈ సినిమాకి డేట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఎన్నికలు ఏప్రిల్ లో వస్తే ఈ రెండు చిత్రాలు ఆలోపు విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇలా చేయడం వల్ల పెద్దగా ఇంపాక్ట్ ఉండాలని పలువురి నెటిజెన్లు తెలుపుతున్నారు. ఎందుకంటే సినిమాలు వేరు రాజకీయం వేరు అనే అంతగా ప్రజలు మారిపోయారు.