భోళా శంకర్ చిత్రానికి అలాంటి కండిషన్ పెట్టిన సుశాంత్..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. హీరోయిన్ గా తమన్నా నటిస్తూ ఉండగా చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే కీర్తి సురేష్ కు జోడిగా అక్కినేని హీరో సుశాంత్ నటించడం జరిగింది. ఆగస్టు 11న ఈ సినిమా చాలా గ్రాండ్గా విడుదలవుతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రంలో నటించిన సుశాంత్ ఒక కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

Bhola Shankar : Akkineni Sushanth playing an important role in chiranjeevi  bhola shankar

సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో నటీనటులు సైతం ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుశాంత్ భోళా శంకర్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కి జోడీ గా కీలకమైన పాత్రలో నటిస్తున్నానని ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బాస్టర్ అయిన వేదాళం చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిస్తున్నప్పటికీ.. డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ చిత్రంలో పలు మార్పులు చేశారని తెలిపారు.

ఈ చిత్రంలో అవకాశం రాగానే సుశాంత్ చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారని అంతేకాకుండా డైరెక్టర్ మెహర్ రమేష్ కి ఒక కండిషన్ పెట్టినట్లుగా తెలిపారు.. చిన్నప్పటినుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాం ఆయన డాన్సులని చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసే వారిని రెండుసార్లు చిరంజీవి గారి సినిమాకి షూటింగ్స్ కి వెళ్లాను.. కానీ ఇప్పుడు ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టం అని తెలిపారు.ఇందులో తనకు ఒక పాట ఉందని కూడా తెలిపారు. చిరంజీవి గారితో కలిసి డాన్స్ వేసే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి.. వెంటనే నాకు మాత్రం సాంగ్ లో చిరంజీవితో డాన్స్ వేయాలని కండిషన్ ని పెట్టినట్లుగా తెలిపారట సుశాంత్. అలా డైరెక్టర్ మాట ఇవ్వడంతో ఈ సినిమాకి ఒప్పుకున్నారని తెలిపారు.