స్టార్ హోదాలో ఉండి కూడా అలాంటి ప‌ని చేసిన అనుప‌మ‌.. డ‌బ్బు కోస‌మేనా ఇదంతా?

మ‌ల‌యాళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. తెలుగులో ఈ బ్యూటీ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగం అయింది. అందులో సిద్ధు జొన్నలగడ్డ `టిల్లు స్క్రేర్‌` ఒక‌టి కాగా.. మ‌రొక‌టి మాస్ మ‌హారాజ ర‌వితేజ `ఈగ‌ల్‌`. ఈ రెండు చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. అలాగే మ‌ల‌యాళంలో ఓ సినిమా, త‌మిళంలో ఓ సినిమా చేస్తోంది.

అయితే చేతి నిండా సినిమాలు ఉన్నా.. అనుప‌మ ప్రైవేటు ఆల్బమ్ లో నటించి అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. నిజానికి మన టాలీవుడ్ లో ఈ ప్రైవేటు ఆల్బమ్స్ కు అంతగా ఆదరణ ఉండదు. ఇక్క‌డి సెలబ్రెటీలు ఎవరూ అలాంటి ఆల్బమ్స్ చేయడానికి శ్రద్ధ చూపరు. కానీ, అనుప‌మ చేసింది. డ‌బ్బు కోస‌మా లేక కొత్త ట్రెండ్ ను సెట్ చెయ్యాల‌న్న ఆరాటంతోనా అన్న‌ది తెలియ‌దు గానీ రీసెంట్ గా కెరీర్ లోనే తొలిసారి ఓ ఆల్బమ్ సాంగ్ చేసింది.

తాజాగా ఈ సాంగ్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ‘పద పద’ అంటూ సాగే ఈ సాంగ్ కు రిచర్డ్ ప్రసాద్ దర్శకత్వం వ‌హించ‌గా.. ఏ.వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు. సింగర్ చన్మయి శ్రీపాద పాడిన ఈ పాట‌ను డెన్నిస్ నార్టన్ కంపోజ్ చేశాడు. జపాన్ లోని టోక్యో అందాలు చూపిస్తూ ఎంతో క‌ల‌ర్ ఫుల్ గా ఈ సాంగ్ ను చిత్రీక‌రించారు. ఇందులో అనుప‌మ డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో చాలా ఉల్లాసంగా డ్యాన్స్ చేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. నెటిజ‌న్లు సాంగ్ బాగుంద‌ని.. విజువ‌ల్స్ సుప‌ర్ అని.. అనుప‌మ అద‌ర‌గొట్టేసింద‌ని కొనియాడుతున్నారు.