ర‌జ‌నీకాంత్ మూవీకి నాని షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌.. 20 నిమిషాల పాత్ర‌కు అన్ని కోట్లా?

టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడంటూ గ‌త వారం నుంచి నెట్టింట జోరుగా ప్రచారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.జైల‌ర్ అనంత‌రం ర‌జ‌నీకాంత్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. రజ‌నీకాంత్‍ 170వ సినిమా కావటంతో `తలైవర్ 170` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ప‌ట్టాలెక్క‌బోతోంది.

ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిసంచనున్నాడు. మ‌రికొద్ది రోజుల్లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రంలో నాని ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే మేక‌ర్స్ నానీని సంప్ర‌దించ‌గా.. క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పాడ‌ట‌. క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర‌లో నాని క‌నిపిస్తాడ‌ని.. సినిమాలో దాదాపు ఇరవై నిమిషాల‌కు పైగా ఆయ‌న రోల్ ఉంటుంద‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. ర‌జనీకాంత్ మూవీకి నాని షాకింగ్ రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తున్నాడట‌. ఇర‌వై నిమిషాల పాత్రే అయినా నాని ఏకంగా రూ. 10 కోట్లు డిమాండ్ చేశాడ‌ట‌. నాని గ‌త చిత్రం `ద‌స‌రా` పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. నాని మార్కెట్ ను భారీగా పెంచింది. అందుకే రూ. 10 కోట్లు డిమాండ్ చేయ‌గా.. అందుకు తలైవర్ 170 మేక‌ర్స్ ఒప్పుకున్నార‌ట‌. ఏదేమైనా ఇర‌వై నిమిషాల పాత్ర‌కు ప‌ది కోట్లంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి.