సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల టాలీవుడ్ లో సినిమాలు పెద్దగా చేయడం లేదు. ఒకప్పుడు వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ స్టార్స్ తో పాటు ఎన్టీఆర్, ప్రభాస్ వంటి యంగ్ స్టార్స్ తోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ, ఇప్పుడు టాలీవుడ్ వొంక చూడటమే మానేసింది. కోలీవుడ్ సినిమాలతోనే ఫుల్ బిజీగా గడుపుతోంది. త్వరలోనే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.
హిందీలో తొలి సినిమానే ఏకంగా షారూఖ్ ఖాన్ వంటి స్టార్ తో చేసింది. అదే `జవాన్`. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. హై బడ్జెట్ తో యాక్షర్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తే.. నయనతార బాలీవుడ్ లో బిజీ అవ్వడం ఖాయమవుతుంది. ఇదే తరుణంలో నయనతార తెలుగు సినిమాల మీద ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు. ఒకవేళ తెలుగు సినిమాల్లో ఆఫర్స్ వచ్చినా.. కొత్త కండీషన్ పెడుతుందట.
తెలుగులో తాను నటించాలంటే ఆ సినిమాలో హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ తనకు ఇవాలని చెబుతుందట. అప్పుడే సినిమాకు సైన్ చేస్తానని నయనతార చెబుతుందట. దాంతో అది కుదరని పని అని చెప్పి మేకర్స్ వెనుతిరుగుతున్నారట. ఎందుకంటే, టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అందరూ రూ. 50 నుంచి 100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అంతే రెమ్యునరేషన్ నయనతారకు ఇస్తే నిర్మాతలు రోడ్డున పడతారు. అందుకే నయనతార కొత్త కండీషన్ కు తెలుగు దర్శక నిర్మాతలు ఏమాత్రం ఒప్పుకోవడం లేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో నెటిజన్లు నయనతారకు బాగా బలిసిందని.. స్టార్డమ్ ఉందని ఓవర్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.