మరికొద్ది గంటల్లో ఖుషి రిలీజ్..నాగచైతన్య చేసిన పనికి అంతా షాక్.. ఏం కర్మ బాసూ నీకు..!?

టాలీవుడ్ రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ – స్టార్ హీరోయిన్గా పబ్లిసిటీ సంపాదించుకున్న సమంత కలిసి జంటగా నటించిన సినిమా ఖుషి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఇదే క్రమంలో థియేటర్స్ వద్ద సామ్- విజయ్ ఫ్యాన్స్ సందడి మొదలైపోయింది . భారీ కటౌట్లతో ఫ్లెక్సీలతో పూలదండలతో విజయ్ ఫోటోలను ప్రదర్శిస్తున్నారు అభిమానులు . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాక్ ప్రకారం సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ తెలిసిపోతుంది .

మరీ ముఖ్యంగా నేటి యువత పెళ్లి పేరుతో చేస్తున్న తప్పులు.. భార్యాభర్తల మధ్య మిస్ అండర్స్టాండింగ్ ఎలా వస్తున్నాయో ఈ సినిమాలో క్లియర్ గా చూపించారట డైరెక్టర్ శివ . కాగా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఖుషి సినిమాకి సంబంధించిన టాక్ ఎలా ఉన్నా కానీ నాగచైతన్య తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఖుషి సినిమా రిలీజ్ అవ్వబోతుంది .. ఈ సినిమాలో సమంత – విజయ్ ఎంత హాట్ గా కనిపించారో మనం చూసాం .

కచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యాక నాగచైతన్య పై వార్తలు వైరల్ అవుతాయి . విడాకులు తీసుకున్న తర్వాత ఇంత హాట్ గా సమంత నటించిన మొదటి సినిమా ఇదే కావడంతో సినిమా రిలీజ్ అయ్యాక కచ్చితంగా నాగచైతన్య పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుందని.. ఎక్కడ కనిపించిన ఆయనను సమంతకు సంబంధించిన ప్రశ్నలు వేస్తారని అర్థం చేసుకున్న నాగచైతన్య ఇంటి నుండి బయటకు రాకూడదని డిసైడ్ అయ్యారట . అంతేకాదు ఇంటికి దూరంగా ఆల్రెడీ ఓ ఫ్లాట్ లో ఉంటున్న నాగచైతన్య తన ఫ్రెండ్స్.. ఇంటి పని వాళ్లు.. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని మీట్ అవ్వను అంటూ ముందుగానే చెప్పేసారట . ఇంటి పని వాళ్ళను సైతం రావద్దు అంటూ నాగచైతన్య ముందుగానే చెప్పుకొచ్చారట . తను ఒక్కడే ఇంట్లో ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే అంత పెద్ద స్టార్ హీరో కొడుకు అయినా సరే ఇదేం కర్మ రా బాబు నీకు అంటూ పలువురు కామెంట్స్ చేస్తుంటే మరికొందరుభార్య వదిలేసిన భర్తకు ఇలాంటి తిప్పలు తప్పవు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్య సమంతల పేర్లు మరోసారి వైరల్ గా మారాయి..!!