కెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ లో చిందులు వేయబోతున్న రష్మిక..ఏ సినిమాలో అంటే..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న ముద్దుగుమ్మ ఐటమ్ సాంగ్స్ లో నటించడం కొత్త ఏం కాదు చాలా చాలా కామన్ గానే ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కాగా అదే లిస్టులోకి ఎంతో మంది హీరోయిన్స్ ఇప్పటికే యాడ్ అయిపోయారు . తాజాగా ఆ లిస్టులోకి నేను యాడ్ అవుతాను అంటుంది రష్మిక మందన్నా. పేరుకి కన్నడ బ్యూటీనే అయినా తెలుగులో పలు సినిమాల ద్వారా పాపులారిటీ సంపాదించుకొని నేషనల్ క్రష్ గా పబ్లిసిటీ మూటగట్టుకున్న రష్మిక మందన్నా..

ప్రెసెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలకు కమిట్ అవుతుంది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నా సరే ఇప్పటికి క్రేజీ క్రేజీ ఆఫర్స్ ను ఆమె తన ఖాతాలో వేసుకుంటుంది . కాగా ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రష్మిక మందన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉంది .

ఇప్పటివరకు అక్కడ నటించిన సినిమాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు . కానీ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు . ఈ క్రమంలోనే రష్మికకు స్టార్ హీరో ఐటమ్ గర్ల్ గా ఛాన్స్ ఇచ్చారట . స్టార్ హీరో కావడం భారీ రెమ్యూనరేషన్ ఇస్తూ ఉండడంతో రష్మిక సైతం ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేయలేక పోయిందట . అందుకే ఫస్ట్ టైం బాలీవుడ్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించడానికి చిందులు వేయడానికి రెడీ అయిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది..!!