ఆ స్టార్ హీరో సినిమాలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్.. బాలయ్య కి తెలియకుండానే పని పూర్తి చేసేసారుగా..!!

కోట్లాదిమంది నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా మూమెంట్ నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ. అదిగో ఎంట్రీ ఇదిగో ఎంట్రీ ఇస్తున్నాడు అని వార్తలు వినిపించడం తప్పిస్తే ఇప్పటివరకు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ అఫీషియల్ గా ప్రకటన వచ్చిందే లేదు. అయితే తెరవెనుక బాలయ్య మాత్రం దానికి తగ్గ పనులు చక్కగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

కాగ రీసెంట్గా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . రీసెంట్గా బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా సెట్స్ లో పాల్గొన్నాడు మోక్షజ్ఞ. దీనికి సంబంధించిన పిక్స్ సైతం నెట్టింట వైరల్ గా మారాయి . అయితే మోక్షజ్ఞ భగవంత్ కేసరిలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . అనిల్ రావిపూడి ఈ క్రేజీ ధాట్ ను ఇంప్లిమెంట్ చేశారట.

అయితే బాలయ్యకు ఇది ఏ మాత్రం ఇష్టం లేనట్లు తెలుస్తుంది . కానీ అనిల్ రావిపూడి ఇచ్చిన ధాట్ ప్రకారం ఇది సక్సెస్ అవుతుందని బాలయ్య ముందుకు వెళ్లారట . అంతేకాదు బాలయ్యకు తెలియకుండానే మోక్షజ్ఞతో నాలుగు మూడు షాట్లు కూడా రెడీ చేసుకున్నారట అనిల్ రావిపూడి. బాలయ్య ఫైనల్ అంటే ఆ క్లిప్స్ ను సినిమాలో యాడ్ చేస్తామని లేదంటే ఆ పాత్రను తీసేస్తామని చెప్పుకొచ్చారట. ఫైనల్లీ బాలయ్య సైతం ఓకే చేసినట్లు తెలుస్తుంది . మొత్తానికి నాన్న సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మోక్షజ్ఞ అన్న కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!