దేవర సినిమాపై అదిరిపోయే అప్డేట్.. ఎన్టీఆర్‌కి అండర్ వాటర్ ట్రైనింగ్..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ పాస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం.. అది కూడా కొరటాల శివ డైరెక్షన్లో రూపొందడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలా సీరియస్ గా, ప్రశాంతంగా జరుగుతుంది.

ఇక ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు కొరటాల. రాజమౌళితో సినిమా చేసిన హీరో పనికొన్నాళ్లపాటు కష్టం అనే సెంటిమెంట్‌ పక్కనపెట్టి మరి.. ఎలాగైనా ఎన్టీఆర్ తో రికార్డ్స్ సృష్టించాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికీ సినిమా షూటింగ్ సరవేగంగా సాగుతుంది. ఇక ఈ సినిమా సముద్ర నేపథ్యంలో తరికెక్కుతున్న సంగతి తెలిసిందే.

సముద్రం మీద కీలక సన్నివేశాలు ఉన్నాయి. వీటిలో ఒకటి రెండు సీన్‌లు అండర్ వాట‌ర్‌లో కూడా తెరకెక్కించాల్సి ఉంది. సినిమాకు సిజి వర్క్‌లు ఎంత ఎక్కువగా ఉన్నా సరే కొన్నిసార్లు అండర్ వాటర్ లో షూట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఎన్టీఆర్‌కు అండర్ వాటర్ ట్రైనింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ ట్రైనింగ్ కోసం ముంబై నుంచి ట్రైనర్లను రప్పించారట. ప్రస్తుతం ఎన్టీఆర్‌కి అండర్ వాటర్ ట్రైనింగ్ జరుగుతుందని యూనిట్ వర్గాల నుంచి టాక్. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కాబోతుంది.