నమ్రత అలాంటి బూతులు మాట్లాడుతుందా..? మగాళ్లు కూడా చెవులు మూసుకోవాల్సిందేనా..? మహేశ్ ఓపెన్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్న అందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఆయన భార్య నమ్రతల జంట . సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి . కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి.. వాళ్ళని లైఫ్ లో సెటిల్ చేయడానికి ఎంతలా తాపత్రయపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. రేపో మాపో మహేష్ బాబు కూతురు సితార ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాబోతుంది .

ఇదే విషయాన్ని అఫీషియల్ గా కూడా కన్ఫర్మ్ చేశారు మహేష్ బాబు నమ్రతలు. కాగ రీసెంట్ గానే ఓ జ్యూవలరి యాడ్లో చాలా చక్కగా కుందనపు బొమ్మలా కనిపించింది . కాగా ఇలాంటి క్రమంలోనే నమ్రత మహేష్ బాబులకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది . సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు సుమ అడిగిన ప్రశ్నలకు జవాబు ఇస్తూ తన భార్య నమ్రత పై షాకింగ్ కామెంట్స్ చేశాడు .

అంతేకాదు సుమ వచ్చి “మీరు మాలాగా గాసిప్స్ మాట్లాడుకుంటారా..? సార్ అని అడగగ్గా… మహేష్ బాబు రిప్లై ఇస్తూ “నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు.. కానీ నా భార్య నమ్రత ఎక్కువగా మాట్లాడుతుంటుంది.. ముంబై కదా ..పొద్దున లేచిన మొదలు అదే పని .. అంతేకాదు కొన్నిసార్లు ఆమె మాట్లాడిన మాటలు వినలేక చెవులు మూసుకోవాల్సిందే “అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. దీంతో సుమ సైతం షాక్ అయిపోయింది . “అమ్మ బాబోయ్ నా గురించి ఏమన్నా మాట్లాడుకున్నారా? సరేలేండి చెప్పొద్దు అంటూ ఫన్నీగా కౌంటర్ వేసింది . ఈ వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . మహేష్ బాబు లాంటి సైలెంట్ అబ్బాయికి నమ్రత లాంటి నాటి గార్ల్ ఎలా నచ్చింది అబ్బా.. అంటూ కూడా అప్పట్లో ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు . అయితే ఇదంతా సరదాగా చేసిన కామెంట్స్ అంటూ ఆ తర్వాత క్లారిటీ వచ్చేసింది. ప్రజెంట్ మహేష్ బాబు చేసిన కామెంట్స్ తాలూకా వీడియో నెట్టింట మరోసారి వైరల్ గా మారింది..!!